మీ కిండర్ కిట్ గురించి:
చిన్నారుల కోసం, ఆట మరియు అభ్యాసం జోడీగా వెళతాయి. చిన్నారులు వారి గురించి మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎలా కనుగొంటారు మరియు నేర్చుకుంటారు అన్నది ఆటగా ఉంటుంది. ఆ ప్రయాణంలో తల్లిదండ్రులు, కుటుంబాలు ఒక పెద్ద భాగంగా ఉంటారు. మీ చిన్నారి కిండర్ కిట్లో ప్రతిదీ ఒక కుటుంబంగా పంచుకోవడానికి, ఆనందించడానికి రూపొందించబడింది.
కిండర్గార్టెన్లో, విక్టోరియన్ తొలి సంవత్సరాల అభ్యాసం మరియు అభివృద్ధి ఫ్రేమ్వర్క్(VEYLDF) అన్నది ఒక అభ్యాసన అనుభవాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది, అది మీ చిన్నారి అయిదు అభ్యాసన మరియు అభివృద్ధి ఫలితాల వ్యాప్తంగా పెరుగుదలకు, కృషికి మద్ధతిస్తుంది. ఈ అయిదు ఫలితాలు ఇవి:
- గుర్తింపు
- కమ్యూనిటీ
- శ్రేయస్సు
- అభ్యాసం
- కమ్యునికేషన్
కథలు చెప్పే క్యూబ్స్
చిన్నారులు వారి రోజువారీ అనుభవాలను ఎలా గుర్తిస్తారన్న దాంట్లో కథలు చెప్పడం ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఇది అక్ష్యరాస్యత వృద్ధి మద్ధతిస్తుంది మరియు వారి చుట్టూ ఉన్న ప్రజలతో ఎలా సంభాషించాలో అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడుతుంది.
ఇంగ్లీష్ లేదా ఇతర భాషలలో ఉన్న క్యూబ్స్తో మీ చిన్నారి కొత్త పదాలు నేర్చుకోవడంలో మీరు సహాయపడవచ్చు.
- టర్న్స్ తీసుకోండి, చిత్రాలకు పేరు పెట్టండి
- వాటితో నిర్మించండి
- కథలు చెప్పండి
- ప్రశ్నలు అడగండి
క్రేయాన్స్ మరియు ఆర్ట్ప్యాడ్స్
క్రేయాన్స్తో గీయడం అన్నది అభ్యసించడానికి అనేక మార్గాలను అందిస్తుంది:
- పెన్సిల్ పట్టు వంటి అనేక చక్కటి మోటార్ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి
- చేయి-కన్ను మధ్య సమన్వయం
- రంగు మరియు ఆకారాల గురించి నేర్చుకోవడం
- పేపర్ మరియు ఇతర పదార్థాలతో సృజనాత్మకతను వ్యక్తీకరించడం
మరింత ముఖ్యమైందిగా, మీ చిన్నారి వారికి వారు సురక్షితంగా మరియు విశ్వాసభరితంగా వ్యక్తీకరించడాన్ని నేర్చుకుంటారు. కొంతమంది చిన్నారులు మీరు గుర్తించడానికి వీల్లేని గుర్తులు చేస్తారు, అయితే అది పర్వాలేదు. ఇది గీయడాన్ని నేర్చుకొనే సహజ ప్రక్రియగా ఉంటుంది.
- భావనలను ప్రేరేపించడానికి ఆర్ట్ ప్యాడ్ఉపయోగించండి
- కుటుంబ చిత్రీకరణ అనుభవాలను ప్రోత్సహించండి
- మీరు చిత్రిస్తున్నట్లుగా మాట్లాడండి
- రంగులు మరియు ఆకారాల పేర్లు చెప్పండి
విత్తనాలు
విత్తనాలతో చిన్నారులు చిత్రించడం అన్నది చక్కటి సైన్సు ఆధారిత అభ్యాసన అనుభవంగా ఉంటుంది, ది ప్రకృతి ప్రపంచం యొక్క అధ్భుతాన్ని వారు చూడడానికి అనుమతిస్తుంది. వారు ప్రకృతి గురించి నేర్చుకుంటారు, భాషను నిర్మించుకుంటారు మరియు చిన్నపాటి నిబంధనలను అనుసరించడం నేర్చుకుంటారు. కాలక్రమంలో విషయాలను ఎలా పరిశీలించాలి అన్నది కూడా వారు నేర్చుకుంటారు.
- మొక్కల గురించి మాట్లాడండి మరియు వాటి భాగాల పేర్లు చెప్పండి
- కలిసికట్టుగా వాటిని నాటండి
- ప్రతి ఉదయం పెరుగుదలను తనిఖీ చేయండి
- మార్కెట్లో పండ్లు, కాయల పేర్లు చెప్పండి
జంతువులను అల్లడం
తొలి బాల్యంలో చిన్నారులు చేతులు, వేళ్లు, మణికట్లు, పాదాలు మరియు మునివేళ్లలోని చిన్నపాటి కండరాలపై మరింత నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తారు. చేతులు మరియు వేళ్లలో మెరుగైన యాంత్రిక కండరాల అభివృద్ధి అన్నది చిన్నారుల స్వీయ-శ్రద్ధ మరియు తరువాత రాయడానికి ముఖ్యమైనదిగా ఉంటుంది. మీ చిన్నారి ప్లేడగ్, క్రేయాన్స్ లేదా జంతువులను అల్లడాన్ని ఉపయోగించడం ద్వారా వారి మెరుగైన యాంత్రిక నైపుణ్యాలను వృద్ధి చేసుకోగలరు. మీరు మెరుగైన మోటారు నైపుణ్యాలను ఆచరించడానికి ఇక్కడ కొన్ని మార్గాలున్నాయి:
- జంతువు రంధ్రాల గుండా దారాన్ని అల్లడం
- కిండర్ కిట్ను తెరవడం మరియు మూసేయడం
- జిప్లు వేయడం లేదా బొత్తాలు పెట్టుకోవడం ఆచరించడం
- చేతులు మరియు వేళ్లతో ప్లేడగ్‌ను చుట్టడం
ప్లేడగ్
సృష్టించడానికి మీ చిన్నారి ప్లేడగ్నుఉపయోగిస్తున్నప్పుడు, వారు చాలా ముఖ్యమైన విషయాల వైవిధ్యాలను చేస్తున్నారు:
- మెరుగైన యాంత్రిక నైపుణ్యాలను మెరుగుపర్చడం
- అన్వేషించడానికి వారి జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం
- వారి ఊహాశక్తిని ఉపయోగించడం
ప్లేడగ్తో సృష్టించడం అన్నది మీ చిన్నారి అభ్యాసంలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది.
- ఒక బాల్నుచుట్టండి, దాన్ని కొట్టండి, దంచండి, పిసకండి
- దీని గురించి మాట్లాడండి
- కర్రలు లేదా ఈకలు లేదా పెంకులు వంటి ఇతర వస్తువులను జోడించండి
- మీరు కనుగొనగలిగే వాటితో ఆకృతులు చేయండి
చిన్నారుల పుస్తకాలు
కలిసికట్టుగా పుస్తకాలను చదవడం అన్నది ఒక కుటుంబంగా సమయాన్ని వెచ్చించడానికి ఒక గొప్ప అనుబంధ మార్గంగా ఉంటుంది. అక్షరాస్యత అభివృద్ధి మద్ధతుకి ఇది అత్యంత ముఖ్యమైన మార్గాల్లో ఒకటిగా ఉంటుంది. మీ చిన్నారితో క్రమబద్దమైన కథా-సమయాన్ని పంచుకోవడం అన్నది వారి ఉహాశక్తి మరియు పదజాలాన్ని మెరుగుపరుస్తుంది.
- కలిసికట్టుగా ఒక పుస్తకాన్ని ఎంచుకోండి
- స్థిరపడడానికి ఒక సౌకర్యవంతమైన స్థలాన్ని చూసుకొని, చదవండి
- వారిని పేజీలను తిప్పనివ్వండి
- పాత్రల గురించి వేర్వేరు గొంతులు వాడండి, చిత్రాల గురించి మాట్లాడండి
సంగీత తయారీదారులు
చిన్నారి అభ్యాసం మరియు అభివృద్ధిలో సంగీతానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ చిన్నారి కొత్త పదాలు నేర్చుకోవడానికి, కుటుంబంతో కలిసి పాటలు పాడడానికి మరియు వారి గురించి మంచిగా భావించడానికి సంగీతాన్ని సృష్టించడం ఒక సరదా మార్గంగా ఉంటుంది. నృత్యం, పాడడం, ఎగరడం మరియు చిటికెలు వాయించడం అన్ని సరదాలో భాగంగా ఉంటాయి.
మీ చిన్నారితో సంగీతాన్ని ఆనందించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి:
- మీ ఇష్టమైన పాటకు కాలు కదపడం, నృత్యం చేయడం
- సంఖ్యలను నేర్పించడానికి లయలను లెక్కించడం
- చిన్న రిథమ్ పాటలను నేర్చుకోవడం
- పదాలలో అక్షరాలను లెక్కించడానికి చిటికెలను ఉపయోగించడం
కిట్ యాక్టివిటీ కేస్
కిట్ యాక్టివిటీ కేస్ అన్నది పుస్తకాలను, బొమ్మలు తీసుకెళ్లే కేస్ కన్నా ఎక్కువగా ఉంటుంది - అనేక మార్గాలలో అభ్యాసం మరియు అభివృద్ధి మద్ధతుకి ఉపయోగించబడుతుంది. వైట్బోర్డ్ ఉపరితలాలు మ్యాగ్నెట్ఆట, ప్లేడగ్ మరియు చిత్ర రచనకి గొప్పగా ఉంటుంది. ఏటవాలు బల్లపై కిట్నుమడవండి. బల్లపరుపుగా కిట్ను పరవండి దీంతో ఆకుపచ్చ ఉపరితలాన్ని ఉహాత్మక ఆట కోసం ఉపయోగించవచ్చు. ఇది ఒక సముద్ర దృశ్యం లేదా నగర వీధిగా ఉండవచ్చు. మీరు కిండర్కి ప్రయాణాన్ని తిరిగి సృష్టించండి. కిట్ కేస్ ఉపయోగానికి ఇక్కడ ఇతర మార్గాలు ఉన్నాయి:
- కొత్త ప్రపంచాలను గీయండి
- ప్లేడగ్ ప్లేమ్యాట్
- పుస్తకాలు లేదా బొమ్మల కోసం కేస్నుతీసుకెళ్లండి.
- పోటు ఆట ఆడుతున్నట్లు నటించండి
కిట్ యాక్టివిటీ కేస్ను ఒక పర్యావరణ హితమైన ఉత్పాదనగా రూపొందించడం జరిగింది. వీలైన చోట్ల దీన్ని పునరుత్పాదన పదార్థాలు తయార చేశారు మరియు మీ చిన్నారి కిండర్గార్టెన్ మెమోంటోల నిల్వగా ఉంచుకొనే విధంగా పునఃప్రయోజనంతో రూపొందించబడింది.
కమ్యూనిటీని నిర్మించడం
విక్టోరియా వైవిధ్యమైన కమ్యూనిటీ, అనేక సంస్కృతులు మరియు భిన్నమైన మాట్లాడే భాషలకు గృహం. మేము ఎవ్వరు అని చేసిన దాంట్లో వైవిధ్యతకి పెద్ద భాగముంది. కిట్లోని అంశాలు భిన్నమైన కమ్యూనిటీల గురించి మాట్లాడడానికి మద్ధతు ఇస్తాయి.
- చిన్నారుల కోసం, ఆట మరియు అభ్యాసం జోడీగా వెళతాయి. చిన్నారులు వారి గురించి ఎలా తెలుసుకుంటారు మరియు నేర్చుకుంటారు అన్నది ఆడుకోవడంగా ఉంటుంది.
- ఇతర లేదా మీ సొంత సంస్కృతి నుంచి ఆహారాన్ని చేయడానికి నటించేలా ప్లేడగ్నుఉపయోగించండి
- ఇతర లేదా మీ సొంత సంస్కృతి నుంచి సంప్రదాయ సంగీతాన్ని వింటున్నప్పుడు చిటికెలను మోగించండి
- మీ చిన్నారితో ఇతర దేశాలు మరియు వాటి స్థానిక జంతువుల గురించి మాట్లాడండి
అస్లాన్లో పుస్తకాలు
2023లో చేర్చబడిన పుస్తకాలతో సహా కిండర్ కిట్లో అస్లాన్ అనువాదాలు లభిస్తాయి. ఆస్లాన్ మరియు కాప్షనింగ్ కూడా వీడియోలతో చేర్చబడింది.
అస్లాన్ అన్నది ఒక చెవిటి భాషగా ఆస్ట్రేలియన్ చెవిటి కమ్యూనిటీలోని మెజారిటీ చేత ఉపయోగించబడుతోంది మరియు కొన్ని నాలుగు సంవత్సరాల వయస్సు కిండర్గార్టెన్లో విక్టోరియా తొలి బాల్యపు భాషల కార్యక్రమంలో భాగంగా కూడా అందుబాటులో ఉంది.
చిన్న వయస్సులో మరో భాషలో చిన్నారుల నేర్చుకోవడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని విద్యా నిపుణులు కనుగొన్నారు, వాటిలో ఇవి ఇమిడి ఉన్నాయి:
- చదవడానికి ముందు మరియు రాయడానికి ముందున్న నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి
- అభిజ్ఞ వశ్యత
- ఆత్మగౌరవం మరియు శ్రేయస్సును పదిలపరుస్తుంది
- సాంస్కృతిక అస్థిత్వాన్ని బలపరుస్తుంది.
ఆస్థిత్వాన్ని గౌరవించడం
ఆస్ట్రేలియా చరిత్రలో మన ప్రథమ జాతి ప్రజల యొక్క సంస్కృతులు ముఖ్యమైన భాగంగా ఉంటాయి అన్ని సంస్కృతుల నిర్మించిన అవగాహన, ఆమోదయోగ్యం, అభిమానం గురించి నేర్చుకోవడానికి చిన్నారులందరినీ ప్రోత్సహించడం. కిట్లో మన ప్రథ జాతి రచయితలు మరియు తయారీదారులను సన్మానించుకోవడానికి మేమెంతో గర్విస్తున్నాము. ఉదాహరణకి, అబొరిజినల్ కథలు చెప్పే ప్రతిధ్వనించే సంప్రదాయాన్ని స్టోరీబ్లాక్స్వర్ణిస్తాయి. ప్రథమ జాతి ప్రజల యొక్క ఆచారాలు మరియు సంస్కృతుల గురించి మీ చిన్నారి మరింత తెలుసుకోవడానికి సహాయపడే కొన్ని కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి:
- జంతువులు లేదా వస్తువుల కోసం అబొరిజినల్ చిహ్నాలను నేర్చుకోవడం
- అబొరిజినల్ నాయకులు లేదా క్రీడా నాయకుల గురించి మాట్లాడడం
- ప్రథమ జాతుల సంస్కృతులు మరియు ప్రజల గురించి మరింత నేర్చుకోవడం
శ్రేయస్సు మరియు అదనపు మద్ధతు
చిన్నారులందరూ వారి సొంతమైన వేగంతో భిన్నంగా నేర్చుకుంటారు. కిండర్ కిట్ మీ చిన్నారికి పుస్తకాలు మరియు బొమ్మలను అందిస్తుంది మరియు వీటిని అన్ని సామర్థ్యాలను సవాల్ చేయడానికి భిన్నమైన అనేక మార్గాల్లో ఉపయోగించవచ్చు. అయితే కొన్నిసార్లు మీ చిన్నారి అభ్యాసానికి మీకు అదనపు మద్ధతు అవసరమవుతుంది. మీ చిన్నారికి కొంత అదనపు మద్ధతు అవసరమని మీకు భావిస్తే, మీరు చేయడానికి అనేక మార్గాలున్నాయి:
- సహాయపడడానికి విక్టోరియా కిండర్గార్టెన్ ఉపాధ్యాయులకు నైపుణ్యాలు, జ్ఞానం ఉంది. మీ సందేహాల గురించి మీ చిన్నారి ఉపాధ్యాయుడితో మాట్లాడండి
- మీ సందేహాల గురించి చర్చించడానికి మీ వైద్యుడు లేదా మాతాశిశు ఆరోగ్య నర్సును చూడడానికి అపాయింట్మెంట్తీసుకోండి
- ఉచితమైన, విశ్వసనీయమైన సలహ మరియు మద్ధతు కోసం పేరెంట్ లైన్ 13 2289 కి కాల్చేయండి,
బాలశిక్షణ కిట్లు సురక్షితమైనవి మరియు సమగ్రమైనవి
Kinder Kits లోని అన్ని వస్తువులు సంబంధిత భద్రత ప్రమాణాలను నేరవేరుస్తాయి మరియు Kinderకు హాజరు అయ్యే మూడు సంవత్సరాల చిన్నారులకు ఇవి సరిపోతాయి.
కొన్ని వస్తువలు మాత్రం చిన్న భాగాలను కలిగి ఉంటాయి మరియు మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసు గల చిన్నారుల ఉపయోగానికి సరిపోవు.
ఇవి వైట్‌బోర్డ్ మార్కర్లు మరియు మాగ్నటిక్ వైట్‌బోర్డ్ ఎరేజర్, వీటిలో మధ్యలో పొదిగిన చిన్న మాగ్నెట్ ఉంటుంది.
ఈ వస్తువుల వెలుపలి ప్యాకేజింగ్‌పై సరిపోయే హెచ్చరికలతో స్పష్టంగా గుర్తులను పెట్టబడి ఉంటాయి మరియు వీటి ఉద్దేశిత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
మీకు మూడేళ్ల కంటే తక్కువ వయసు గల చిన్నారి ఉంటే, దయచేసి వారికి అందుబాటులో లేని విధంగా ఈ వస్తువులను ఉంచండి.
అన్ని వయస్సుల వారి కోసం ఉన్న అన్ని బొమ్మల విధంగానే, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు వాడకానికి ముందు తప్పకుండా తనిఖీ చేయాలి మరియు పాడైపోయినట్లుగా ఉంటే వాటిని పడేయాలి.
Reviewed 22 September 2023