Three-Year-Old Kindergarten brochure - Telugu

విక్టోరియన్ ప్రభుత్వం వచ్చే దశాబ్దంలో సార్వత్రిక మూలధనం ద్వారా మూడేళ్ళ-వయస్సు కిండర్ గార్టెన్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి సుమారు $5 బిలియన్లు పెట్టుబడి పెడుతోంది – మరియు ఇప్పుడిది రాష్ట్రమంతటా అందుబాటులో వుంది.

విక్టోరియన్ ప్రభుత్వం వచ్చే దశాబ్దంలో సార్వత్రిక మూలధనం ద్వారా మూడేళ్ళ-వయస్సు కిండర్ గార్టెన్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి సుమారు $5 బిలియన్లు పెట్టుబడి పెడుతోంది – మరియు ఇప్పుడిది రాష్ట్రమంతటా అందుబాటులో వుంది.

దీనర్ధం విక్టోరియన్ పిల్లలకు మరో సంవత్సరం నేర్చుకోవడం, ఎదగడం, ఆడడం మరియు స్నేహితులను చేసుకోవడం.

మూడేళ్ళ వయసు నుండి నాణ్యమైన కిండర్ గార్టెన్ పథకంలో పాల్గొనడం వలన పిల్లలు నేర్చుకోవడం, అభివృద్ధి, ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఫలితాలు వృద్ధి చెందుతాయి.

చిన్న పిల్లలు ఆటల ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటారు.

ఆట ఆధారిత అభ్యాసము వలన చిన్న పిల్లలు బాగా (ఉత్తమంగా) నేర్చుకుంటారు. ఇది పిల్లలకు ఊహాత్మక శక్తి, భాషా నైపుణ్యత మరియు అంకెలు, నమూనాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది. వారు ఇతరులతో ఎలా కలిసిఉండడం, పంచుకోవడం, వినడం మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా తెలుసుకుంటారు.

విక్టరియాలో ఉన్న పిల్లలందరికీ రెండేళ్ళ కిండర్ గార్టెన్ నిధులు ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది

2022 నుండి రాష్ట్రంలోని పిల్లలందరూ ప్రతీ వారం కనీసం ఐదు గంటల కిండర్ గార్టెన్ నిధి పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. 2029 నాటికి ఇవి 15 గంటలకు పెంచడం జరుగుతుంది.

మీ పిల్లవాడు ఏ కిండర్ గార్టెన్ కి వెళ్ళినా ఉపాధ్యాయులు మరియు శిక్షణ పొందిన విద్యావేత్తలు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు.

పిల్లలు ఈ కిండర్ గార్టెన్ పథకం ద్వారా చైల్డ్ కేర్ సేవకు గానీ స్వతంత్ర కిండర్ గార్టెన్ కు గానీ హాజరు కావచ్చు.

చిన్న పిల్లలు ఆటల ద్వారా ప్రపంచం గురించి తెలుసుకుంటారు.

వారు ఇతరులతో ఎలా కలిసిఉండడం, పంచుకోవడం, వినడం మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం కూడా తెలుసుకుంటారు.

కిండర్ గార్టెన్ పథకంలో పిల్లలు ఆటలను ఉపయోగించుకొని భాషా నైపుణ్యతను పెంపొందించుకోవడం మరియు అంకెలు, నమూనాల గురించి తెలుసుకుంటారు.

ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలు, పిల్లలు తెలుసుకోవడానికి గల ఆసక్తి, సృజనాత్మకత మరియు నమ్మకం కలగడానికి సహాయం చేస్తారు.

Updated