ఎలా మరియు ఎప్పుడు నమోదు చేయాలి (How and when to enrol) - తెలుగు (Telugu)

నమోదు ప్రక్రియ గురించి మీ స్థానిక కౌన్సిల్ లేదా బాలశిక్షణాకేంద్రం తో మాట్లాడండి. మీరు, మూడేండ్ల బాలశిక్షణాలయ విచారణ లైన్‌ 1800 338 663 కు ఫోన్ చేయవచ్చు లేదా 3YO.kindergarten@education.vic.gov.au కి ఇమెయిల్ చేయవచ్చు. మీ భాషలో సహాయం కోసం లేదా అనువాదకుని పొందడానికి, ముందుగా 131 450కి ఫోన్ చేయండి.

శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్)

శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చిన పిల్లలు అదనపు సహాయము పొందవచ్చు, మరియు శిశు పాఠశాల ద్వారా బాలశిక్షణాలయం లో చేరటానికి ప్రాధాన్యత పొందవచ్చు. మీరు మీ పిల్లలను స్థానిక బాల శిక్షణా కేంద్రంలో నమోదు చేసుకుంటున్నప్పుడు, శిశుపాఠశాల గురించి వారిని అడగవచ్చు, లేదా మరింత సమాచారం కోసం Early Start Kindergarten సందర్శించండి.

ఎప్పుడు నమోదు చేసుకోవాలి

విక్టోరియాలో, పిల్లలకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, వారిని బాల శిక్షణ కార్యక్రమంలో చేర్చవచ్చు. మీరు మీ పిల్లల పుట్టిన తేదీని ప్రారంభ వయస్సు కాలిక్యులేటర్ లో నమోదు చేసి, వారు మూడు మరియు నాలుగేండ్ల బాలశిక్షణని ఎప్పుడు ప్రారంభించవచ్చో తెలుసుకోవచ్చు.

మీ పిల్లల పుట్టినరోజు జనవరి 1 మరియు ఏప్రిల్ 30 మధ్య ఉంటే, వారు పాఠశాల ఏ సంవత్సరంలో ప్రారంభిస్తారో నిర్ణయించటం ద్వారా వారు ఏసంవత్సరంలో బాలశిక్షణకు హాజరవుతారనే దానిని నిర్ణయించవచ్చు. మీ బిడ్డ పాఠశాలకు ఐదేళ్లు వచ్చినప్పుడు వెళ్ళాలా లేక ఆరేళ్లకు వెళ్ళాలా అనేది మీరు నిర్ణయించు కోవచ్చు.

బాల శిక్షణాకార్యక్రమాన్ని కనుగొనండి

ఆమోదించబడిన బాల శిక్షణాకార్యక్రమాలను అందించే సేవాసంస్థలను కనుగొనడానికి, (ఫైండ్ ఎ కిండర్ ప్రోగ్రామ్ – డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, విక్టోరియా (Educationapps.vic.gov.au)) వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ స్థానిక కౌన్సిల్ మరియు బాల శిక్షణా కేంద్రాలు కూడా బాల శిక్షణ కోసం చోటును కనుగొనడంలో మీకు సహాయపడతాయి.

కిండర్ టిక్ (గుర్తు) కోసం చూడండి:

కిండర్ టిక్ విక్టోరియా కుటుంబాలు తమ పిల్లల కోసం, ఆమోదించిన కిండర్ కార్యక్రమం కనుగొనడంలో సహాయపడుతుంది.

మీ స్థానిక బాల శిక్షణాలయం వద్ద, దాని లోపల లేదా భవనం మీద లేదా మైదానంలో, వారి వెబ్ సైట్ లేదా వారి సమాచార పత్రాల లో కిండర్ టిక్ లోగో కొరకు చూడండి.

Updated