Victoria government logo

ఆర్థిక సహాయం మరియు శిశు పాఠశాల (Financial Assistance and Early Start Kindergarten) - తెలుగు (Telugu)

పిల్లలందరికీ రెండు సంవత్సరాల పాటు కిండర్ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రభుత్వం నిధులు అందిస్తుంది. చాలా కేంద్రాలు ప్రభుత్వ నిధులకు అదనంగా రుసుమును వసూలు చేస్తాయి. మీ కుటుంబం ఈ ఖర్చుకు సహాయం పొందవచ్చు. ఒకవేళ మీరు శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుంచి వచ్చినట్లయితే, శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) అనే కార్యక్రమం లభ్యం అవుతుంది. మీబిడ్డ కోసం ప్రతివారం సాధ్యమైనంత గరిష్ట మొత్తంలో ఉచిత కిండర్ కార్యక్రమ సమయం పొందేలా శిశుపాఠశాల సహాయపడుతుంది.

2023 లో, మూడేండ్ల బాలల కిండర్ కార్యక్రమాలు ప్రతి వారం 5 నుండి 15 గంటల మధ్య మరియు నాలుగేండ్ల బాలల కిండర్ కార్యక్రమాలు 15 గంటల పాటు ఉంటాయి. శిశు పాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్ - ESK) ద్వారా నమోదు చేసుకోవడం వలన, మూడేండ్ల మరియు నాలుగేండ్ల బాలల బాలశిక్షణాలయం కార్యక్ర మాలలో ప్రతి వారం పూర్తి 15 గంటలు హామీ ఇవ్వబడుతుంది. ఇది దిగువ పేర్కొన్న బాలల కొరకు లభ్యం అవుతుంది:

 • శరణార్థి లేదా శరణార్థి నేపథ్యం నుండి వచ్చినవారు
 • ఎబొరిజినల్ లేదా టొర్రిస్ స్త్రైట్ ఐలాండర్ గా గుర్తించిన వారు
 • వారి కుటుంబానికి బాలల రక్షణతో సంబంధాలు వున్న వారు

ఈ బాలలు విక్టోరియాలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, అమలుపరచే కాలంలో వారానికి 15 గంటల ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడిన కిండర్ ను అందుకోవచ్చు. వారికి ప్రస్తుత అందుబాటు మరియు వారు తీసుకొనే గంటలు మారవు.

ఎలా దరఖాస్తు చేయాలి:

శిశుపాఠశాల, అర్హత కలిగిన టీచర్ ద్వారా అందించబడే అన్ని కిండర్ కార్యక్రమాల్లో లభ్యం అవుతుంది. మీకు సమీపంలో ఉన్న కిండర్‌ని సంప్రదించి, శిశుపాఠశాల (ఎర్లీ స్టార్ట్ కిండర్ గార్టెన్) గ్రాంట్‌ను అందుకోమని అడగడం ద్వారా మీరు మీ బిడ్డను నమోదు చేసుకోవచ్చు. మీ భాషలో మీకు మద్దతు ఇవ్వడానికి, బాలబడులు ఉచిత అనువాద సేవను పొందగలుగుతాయి.

సాయం కొరకు మీరు మమ్మల్ని లేదా మీ స్థానిక పురపాలక సంఘాన్ని కూడా సంప్రదించవచ్చు. మీ భాషలో సహాయం పొందడం కొరకు మీరు నేషనల్ ట్రాన్స్ లేటింగ్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ సర్వీస్ కు 131 450 కు ఫోన్ చేయవచ్చు. ఆ అనువాదకుని, మీ స్థానిక పురపాలక సంఘం లేదా మా నెంబరుకు ఫోన్ చేయమని అడగండి. అనువాదకులు ఫోన్ లో ఉండి తర్జుమా చేస్తారు.

ఎప్పుడు దరఖాస్తు చేయాలి:

బాలలు బాలశిక్షణాలయానికి హాజరు కావడానికి నమోదు చేసుకున్న సంవత్సరంలో ఏప్రిల్ 30కి ముందు మూడు సంవత్సరాలు నిండితే శిశుపాఠశాలకు అర్హులు.

ఒకవేళ మీ బిడ్డ పుట్టినరోజు జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఉన్నట్లయితే, వారు ఏ సంవత్సరం శిశుపాఠశాలలొ చేరవచ్చో తెలుసుకోవటం కోసం, వారు పాఠశాలను ప్రారంభించే సంవత్సరం గురించి మీరు లెక్కకట్టవలసి ఉంటుంది. మీ బిడ్డ పాఠశాలకు ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు వెళ్ళాలా లేక ఆరు సంవత్సరాలకు వెళ్ళాలా అనేది మీరు నిర్ణయించు కోవచ్చు. అప్పుడు, వారు మూడు లేదా నాలుగు సంవత్సరాలు నిండిన సంవత్సరంలో శిశు పాఠశాలలో చేరవచ్చు. మీ బిడ్డ శిశు పాఠశాలకి ఎప్పుడు అర్హత సాధిస్తారో లెక్కకట్టటానికి మీకు సహాయం అవసరమైతే, మీరు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని కాని, మీ స్థానిక పురపాలకసంఘాన్ని కాని, మీ మాతా మరియు శిశు ఆరోగ్య నర్సుని కాని, లేదా మీ ప్రాంతంలోని ఒక కిండర్, లేదా మీ ప్రాంతంలోని దిగువ పేర్కొన్న సంస్థల్లో దేనినైనా సంప్రదించవచ్చు.

 • మూడేండ్ల బాలల శిక్షణ విచారణ ఫోన్ 1800 338 663
 • బ్రదర్ హుడ్ ఆఫ్ లారెన్స్ 03 9483 1183
 • ఫౌండేషన్ హౌస్ 03 9389 8900
 • ఎఫ్ కె ఎ చిల్డ్రన్స్ సర్వీసెస్ 03 9428 4471
 • మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ నార్త్ వెస్ట్ రీజియన్
  • సెయింట్ ఆల్బన్స్: 1300 676 044 లేదా 03 9367 6044
  • బ్రాడ్ మెడోస్: 03 9351 1278
 • స్పెక్ట్రమ్ మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ 1300 735 653
 • VICSEG న్యూ ఫ్యూచర్స్ 03 9383 2533
 • మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ నార్త్ వెస్ట్ రీజియన్
  • సెయింట్ ఆల్బన్స్: 1300 676 044 లేదా 03 9367 6044
  • బ్రాడ్ మెడోస్: 03 9351 1278
 • స్పెక్ట్రమ్ మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ 1300 735 653
 • VICSEG న్యూ ఫ్యూచర్స్ 03 9383 2533

Reviewed 21 December 2022

Was this page helpful?