కొత్త ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలకు బాల్య విద్యలో ఉద్యోగ అవకాశాలు
విక్టోరియన్ ప్రభుత్వం సాంస్కృతికంగా మరియు భాషాపరంగా విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వారితో సహా అన్ని విక్టోరియన్ కుటుంబాల ఫలితాలను మెరుగుపరచడం ద్వారా మార్పు తీసుకురావడానికి కట్టుబడి ఉంది.
ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, బెస్ట్ స్టార్ట్, బెస్ట్ లైఫ్ సంస్కరణ ద్వారా బాల్య శ్రామిక శక్తిని గణనీయంగా విస్తరించడానికి $370 మిలియన్లకు పైగా పెట్టుబడి పెడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా 11,000 కంటే ఎక్కువ మంది అదనపు బాల్య విద్య ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలను ఆకర్షించడానికి, మరియు మద్దతు ఇవ్వడానికి, వివిధ రకాల శ్రామిక శక్తి చొరవలు రూపొందించబడ్డాయి.
బాల్య విద్యలో ఉద్యోగావకాశాలను పెంచుకోవాలనుకునే అన్ని నేపథ్యాల నుండి అర్హతగల అభ్యర్థులకు ఆర్థిక మరియు ఆర్థికేతర సహాయాలు రెండూ అందుబాటులో ఉన్నాయి.
మీరు బాల్య విద్య గురువు లేదా విద్యావేత్తగా ఎలా మారవచ్చో మరింత తెలుసుకోవడానికి క్రింది సమాచారాన్ని పరిశీలించండి.
బాల్య విద్యలో ఉద్యోగాలు పెంపొందించడం
బాల్య విద్యలో ఉపాధ్యాయులు లేదా విద్యావేత్తలు కావటానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కొరకు అనేక రకాల అధ్యయన ఎంపికలు మరియు ఆర్థిక సహాయాలు అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం సందర్శించండి: బాల్య విద్యలో చదవడానికి మరియు పని చేయడానికి ఆర్ధిక సహాయం | vic.gov.au.
బాల్య విద్యలో ఉద్యోగావకాశాలు మరియు చదువుకు ఆర్థిక సహాయం గురించి మరింత సమాచారం కోసం, సందర్శించండి ప్రారంభ బాల్య విద్య ఉపాధ్యాయుడిగా లేదా విద్యావేత్తగా మారండి.
ఉపాధి
బాల్య విద్యలో ఉపాధి ఆయా వ్యక్తిగత సేవా నిర్వాహకులు మరియు కిండర్ కార్యక్రమాలప్రదాతలచే నిర్వహించబడుతుంది.
ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో చూడటానికి మరియు ఈ రంగంలో పనిచేసే వ్యక్తుల నిదర్శనాధ్యయనం చదవడానికి ఎర్లీ చైల్డ్‌హుడ్ జాబ్స్ వెబ్‌సైట్ కి వెళ్లండి.
అదనపు మద్దతులను అందించే ప్రారంభ బాల్య విద్య పాఠ్యక్రమాల కోసం, సందర్శించండి: ఎర్లీ చైల్డ్ హుడ్ టెర్షరీ పార్టనర్ షిప్ ప్రోగ్రాం | vic.gov.au.
Updated