JavaScript is required

గౌరవప్రదమైన, సురక్షితమైన, నిమగ్నమైన: విద్యార్థుల ప్రవర్తనకు మద్దతు ఇవ్వడానికి ఉమ్మడి ఆకాంక్షలు - తెలుగు (Telugu)

కలిసి, మనం ప్రతి ఒక్కరూ తమదిగా భావిస్తూ, నేర్చుకుంటూ మరియు అభివృద్ధి చెందే సురక్షితమైన పాఠశాలలను స్థాపిస్తాము.

పాఠశాలలు, కుటుంబాలు మరియు విద్యార్థులు కలిసి పనిచేసినప్పుడు, మనం అత్యుత్తమ ఫలితాలను సాధిస్తాము. అందరు విద్యార్థులు ఒక చోట చేరి, నేర్చుకొని మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడే పాఠశాల వాతావరణాలను సృష్టించడానికి ఈ భాగస్వామ్యాలు చాలా అవసరం. తల్లిదండ్రులు మరియు సంరక్షకులుగా, మీ బిడ్డ ఉమ్మడి ప్రవర్తన ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో మరియు వాటిని చేరుకోవడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు.

విద్యార్థులు ఆశించిన ప్రవర్తనలను ఎలా ప్రదర్శిస్తారు

పాఠశాలలో, అందరు విద్యార్థులు గౌరవప్రదంగా, సురక్షితంగా మరియు నిమగ్నమై ఉండాలని ఆశించబడతారు. పాఠశాలలను ప్రతి ఒక్కరూ విజయం సాధించగల ప్రదేశంగా మార్చడానికి ఈ ప్రవర్తనలు సహాయపడతాయి.

విద్యార్థులు గౌరవప్రదంగా, సురక్షితంగా మరియు నిమగ్నమై ఉండటం ద్వారా ఈ ప్రవర్తన ఆకాంక్షలను అందుకుంటారు.

గౌరవప్రదం

  • సిబ్బంది సూచనలు మరియు పాఠశాల నియమాలను పాటించడం.
  • పాఠశాల ఆస్తి మరియు ఇతరుల వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం.
  • గౌరవప్రదమైన భాషను ఉపయోగించడం.

సురక్షితం

  • తమను మరియు ఇతరులను హాని నుండి సురక్షితంగా ఉంచుకోవడం.
  • ఒక వ్యక్తి లేదా మరొకరిని అనుచితంగా చూస్తే వారితో గానీ లేక ఒక పెద్దమనిషితో మాట్లాడటం లేదా సహాయం కోరడం.
  • పాఠశాలకు సురక్షితమైన మరియు అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకురావడం.

నిమగ్నత

  • ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడం, సమయానికి చేరుకోవడం మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం.
  • పాల్గొనడం, తమ వంతు కృషి చేయడం మరియు తమకు అవసరమైనప్పుడు సహాయం కోరడం.
  • చరవాణి విధానాలతో సహా పాఠశాల విధానాలను తెలుసుకోవడం మరియు అనుసరించడం.

తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ఎలా సహాయపడగలరు

సానుకూల ప్రవర్తనను ఆదర్శంగా తీసుకొని మరియు ప్రోత్సహించడం ద్వారా, మీ బిడ్డ పాఠశాలలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు అలవాట్లను పెంపొందించుకోవడానికి మీరు సహాయం చేస్తారు. కుటుంబాలు మరియు పాఠశాలలు కలిసి పనిచేసినప్పుడు, విద్యార్థులు తమ అత్యుత్తమ విజయాలను సాధించగలరు.

తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల ప్రవర్తనకు మద్దతు ఇవ్వడంలో ఇలా సహాయపడగలుగుతారు:

గౌరవప్రదం

  • పాఠశాల నియమాలను తెలుసుకోవడం మరియు ఇంట్లో వాటికి మద్దతు ఇవ్వడం.
  • మీరు పాఠశాల సిబ్బంది, కుటుంబాలు మరియు ఇతరులతో ముఖాముఖీగా మరియు ఆన్‌లైన్‌లో ఎలా మాట్లాడతారో మరియు వారి గురించి ఎలా మాట్లాడాలో గౌరవప్రదమైన ప్రవర్తనను ఆదర్శంగా చూపించడం.
  • సమస్యలను ముందుగానే లేవనెత్తడానికి మరియు పరిష్కరించడానికి పాఠశాల ప్రక్రియలను ఉపయోగించడం.

సురక్షితం

  • మీ బిడ్డ పాఠశాలలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించడానికి సిబ్బందితో కలిసి పనిచేయడం.
  • పాఠశాలలో విశ్వసనీయ పెద్దమనిషి సహాయం అడగడం సరైందేనని మీ బిడ్డ తెలుసుకునేలా చూసుకోవడం.
  • మీ బిడ్డతో మాట్లాడటం ద్వారా మరియు వారి సమస్యలను ముందుగానే పరిష్కరించడం ద్వారా ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేలా చూసుకోవడం.

నిమగ్నత

  • మీ బిడ్డ ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడానికి సహాయం చేయడం - ప్రతి రోజు లెక్కించబడుతుంది.
  • మీ పిల్లల అభ్యాసం మరియు శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి పాఠశాల సిబ్బందికి తెలియజేయడం మరియు కలిసి పనిచేయడం.
  • మీ పిల్లలతో వారి రోజు గురించి మరియు వారి మనోభావాల గురించి మాట్లాడటం మరియు వారి కృషి మరియు పురోగతిని గమనించడం ద్వారా వారి అభ్యసనాన్ని ప్రోత్సహించడం.

కొంతమంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలు పాఠశాల హాజరు లేదా పాఠశాల తిరస్కరణతో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. సహాయపడే కొన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి:

విద్యార్థులు ప్రవర్తన ఆకాంక్షలను అందుకోవడానికి పాఠశాలలు ఎలా సహాయపడతాయి

సానుకూల ప్రవర్తనను బోధించడం మరియు నొక్కి చెప్పడం ద్వారా, పాఠశాలలు అభ్యసనం మరియు శ్రేయస్సుపై దృష్టి సారిస్తూ సానుకూల, సురక్షితమైన మరియు సమంజసమైన అభ్యసన వాతావరణాలు ఉండేలా చూసుకుంటాయి.

పాఠశాలలు గౌరవప్రదంగా, సురక్షితంగా మరియు నిమగ్నమై ఉండటం ద్వారా కుటుంబాలకు మరియు విద్యార్థులకు మద్దతు ఇస్తాయి.

గౌరవప్రదం

  • విద్యార్థులకు పాఠశాల నియమాలు మరియు సానుకూల ప్రవర్తన ఆకాంక్షలను బోధించడం మరియు ప్రదర్శించడం.
  • స్పష్టంగా బోధించడం, ఆదర్శప్రాయం చేయడం మరియు ఆశించే గౌరవప్రదమైన ప్రవర్తనను గుర్తించడం.
  • అందరు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సంరక్షకులతో సమన్వయంగా మరియు సానుకూలంగా పాల్గొనడం.

సురక్షితం

  • బెదిరింపులను నిరోధించడానికి మరియు వాటికి ప్రతిస్పందించడానికి మరియు విద్యార్థులను సురక్షితంగా ఉంచడానికి స్పష్టమైన ప్రక్రియలు మరియు విధానాలను కలిగి ఉండటం.
  • విద్యార్థులకు ముందస్తుగా అదనపు మద్దతులను అందించడం మరియు విద్యార్థులు పైకి మాట్లాడటానికి మరియు సహాయం కోరేందుకు మద్దతు ఇవ్వడం.
  • చొరవ తీసుకొని, సామాజికంగా మరియు సాంస్కృతికంగా సురక్షితమైన పాఠశాల వాతావరణాన్ని నిర్వహించడానికి గాను సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం.

నిమగ్నత

  • అందరి విద్యార్థుల అవసరాలను తీర్చే నిరూపణ-ఆధారిత, సమ్మిళిత విద్యను అందించడం.
  • విద్యార్థులు తమ అభ్యసనాన్ని మరియు పాఠశాల జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలలో తమ అభిప్రాయాన్ని పంచుకునేలా సాధికారత కల్పించడం.
  • అందరు విద్యార్థులు తమను అనుసరిస్తున్నట్లుగా, విన్నట్లుగా మరియు విలువైనవారని భావించేలా బలమైన, విశ్వసనీయ సంబంధాలను నిర్మించడం.

పాఠశాలలు, విద్యార్థులు మరియు కుటుంబాల మధ్య సానుకూల విద్యార్థి ప్రవర్తనను పెంపొందించడానికి మరియు సానుకూల సంబంధాలను పెంపొందించడానికి గాను విద్యా శాఖ పాఠశాలలకు వనరులు మరియు మద్దతును అందిస్తుంది.

తల్లిదండ్రులు మరియు సంరక్షకులు సహాయం కోసం ఎక్కడికి వెళ్ళవచ్చు

మీ బిడ్డ శ్రేయస్సు, ప్రవర్తన లేదా భద్రత గురించి మీరు ఆందోళన చెందుతుంటే:

  • మొదటి చర్యగా మీ పిల్లల ఉపాధ్యాయుడితో లేదా గుర్తించబడిన సంప్రదింపు వ్యక్తితో మాట్లాడండి మరియు సమస్యలను తెలియజేయడానికి పాఠశాల యొక్క ప్రక్రియను అనుసరించండి.
  • పాఠశాలను మద్దతు లేదా సిఫార్సు కోసం అడగండి - వారు మిమ్మల్ని సంక్షేమ సిబ్బంది లేదా నిపుణుల సేవలతో అనుసంధానించగలరు.
  • మీకు మరింత సహాయం అవసరమైతే విద్యా శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించండి.

క్రింది వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి:

Updated